Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గీతం గీతం జయ జయగీతం చేయితట్టి Telugu Christian Song Lyrics

గీతం గీతం జయ జయగీతం చేయితట్టి Lyrics

గీతం గీతం జయ జయగీతం చేయితట్టి పాడెదము

1. చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు
వేసిన ముద్ర కావలినిల్చెను నా దైవ సుతుని ముందు ||గీతం||

2. వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను
చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి ||గీతం||

3. అన్న కయపవారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక
భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి ||గీతం||

4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయవీరుడు రాగా
మీ వేళతాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి ||గీతం||

Your favourites

  • No Favourites found!