Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఘన యెహోవా నీ గుడారం బున Telugu Christian Song Lyrics

ఘన యెహోవా నీ గుడారం బున Lyrics

ఘన యెహోవా నీ గుడారం బున నతిథియౌ వాడెవండు తనర
నీ పరిశుద్ధ పర్వత మున వసించెడు వాఁడెవండు ||ఘన||

1. వెలఁయగను యథార్థ వర్తన గలిగి నీతి ననుసరించుచు నెలమితో
మనసార నిజము పలుకు చుండువాఁడై సుమ్మ ||ఘన||

2. తనదు నాల్కతోఁగొండె మాడఁడు తన సఖునకును గీడు చేయఁడు
తనదు పొరుగు వానిపై నిం దలను మోపఁడించు కేనియు ||ఘన||

3. వానికిని నీచుం డసహ్యుడు వాఁడు భక్తుల గౌరవించును హాని కలిగిన
నాతఁడును బ్ర మాణ మాడియు మాట తప్పఁడు ||ఘన||

4. మరియు ద్రవ్యము వడ్డి కీయఁడు నిరపరాధినిఁ జెఱప లంచము
అరయఁ డిట్టులఁ జేయువాఁడే ధర నెపుడు గదల్పఁబడఁడు ||ఘన||

5. జనక తనయ పావనాత్మకు ఘన మహిమయు కల్గుఁగాక మును
పిపుడు నెల్లప్పుడున్ యుగ ములకుఁ గల్గునుగాక యామేన్ ||జనక||

Your favourites

  • No Favourites found!