Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్ జనులారా స్తోత్రించి Telugu Christian Song Lyrics

ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్ జనులారా స్తోత్రించి Lyrics

ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్-2
జనులారా స్తోత్రించి ముద్దులాడుడి -2
1. పాడుడి మళ్ళి పాడుడీ -2 పాపుల విమోచకుడు
ప్రభు యేసు రక్షకుడు -2 నేడుద్భవించెను బెత్లెహేమున -2 || ఘన ||
2. తట్టుడి కేలు తట్టుడీ -2 తండ్రియగు దేవుడిచ్చె
తన యొక్క ముద్దు పాపన్ -2 నిట్టూర్పులింకేల పాపలోకమా -2 || ఘన ||
3. చుట్టుడి ప్రేమన్ చుట్టుడీ -2 తొట్టిలోన బట్టతోను
చుట్టబడ్డ యేసు పట్టిన్ -2 గట్టిగాను పాదసేవ జేయుడి -2 || ఘన ||
4. దేవుడే తానైననూ -2 దాస్యంపు రూపమును దాల్చుకొన్న
యేసునాధున్ -2 విశ్వాస ప్రేమతోను బట్టుమా -2 || ఘన ||
5. హీనమైన దాసుడా! -2 మానవుని ఘనపర్చ దీనుడాయె
ఘన యేసు -2 ప్రాణంబులన్ గూడ ప్రభుకర్పించు -2 || ఘన ||

Your favourites

  • No Favourites found!