Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఘనమగు వేడుకకు Telugu Christian Song Lyrics

ఘనమగు వేడుకకు Lyrics

కరుణించి కాపాడే యేసయ్యా..
యేసయ్యా… యేసయ్యా..

కూడుకొని మనమీవేళ
ఘనమగు వేడుకకు తెర తీయాలా (2)
గడచిన దినముల కలిగిన సుఖముకై
ప్రభు యేసు ఆశీర్వాదాలకై       ||కూడుకొని||

వేసవి వడగాలుల బాధ తీరిపోయే
యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే
విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే
విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే
గానమై గళమున పాడగా
ధ్యానమై మనసుని తాకగా
ప్రభవించె యేసు దివ్య నాద రూపాన       ||కూడుకొని||

పాతవి కడ తేరగ మనసు మారిపోయే
నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే
ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే
సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే
స్తోత్రమే నిలువుగ లేవగా
ధూపమై వరదుని చేరగా
తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన       ||కూడుకొని||

Your favourites

  • No Favourites found!