ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే (2)
||ఘనమైనవి||
1. యే తెగులు సమీపించనీయక
యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు
ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
||ఘనమైనవి||
2. నాకు ఎత్తైన కోటవు నీవే
నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే
శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతిక్షణమును నీవు
దీవెనగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
||ఘనమైనవి||
3. నీ కృప తప్ప వేరొకటి లేదయా
నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో
నీ కృప నా యెడ చాలునంటివే (2)
నీ అరచేతిలో నను చెక్కుకుంటివి నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
||ఘనమైనవి||
