Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి Telugu Christian Song Lyrics

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి Lyrics


గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షన దుర్గమని
నీ కీర్తినే నేను కొనియాడెదన్
హల్లెలూయా నా యేసునాధా
హల్లెలూయా నా ప్రాణనాధా

1. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలడని
అద్వితీయుడని ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను
హల్లెలూయా నా యేసునాధా హల్లెలూయా నా ప్రాణనాధా

2. సాగరాన్ని రెండుగ చేసినావని సాతాను శక్తులను ముంచినావని
సర్వోన్నతుడని సర్వసంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్
హల్లెలూయా నా యేసునాధా హల్లెలూయా నా ప్రాణనాధా

Your favourites

  • No Favourites found!