Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా Telugu Christian Song Lyrics

గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా Lyrics

గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా
పరలోక రాజ్య ప్రవేశము నీకున్నదా
ఏది గమ్యము ఏది మార్గము
యోచించుమా ఓ క్రైస్తవా (2)

1. ఆరాధనకు హాజరైనా
కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2)
ఎన్ని సభలకు నీవు వెళ్ళినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)

2. సంఘములో నీవు పెద్దవైనా
పాటలెన్నో నీవు పాడినా (2)
వాక్యమును నీవు బోధించినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)

3. ఉపవాసములు ఎన్ని ఉన్నా
ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా (2)
ప్రవచనములు నీవు ఎన్ని పలికినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)

Your favourites

  • No Favourites found!