Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి Telugu Christian Song Lyrics

గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి Lyrics

గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి
1. సర్వాధి కారియు - సర్వోన్నతుండైన
మన తండ్రిని ఘనపరచి - మన ముత్సహించెదము
2. సిద్ధపడెను వధువు - సుప్రకాశము గల
నిర్మల వస్త్రములతో - నలంకరించు కొనెన్
3. పరిశుద్ధుల నీతి - క్రియలే యా వస్త్రములు
గొఱ్ఱె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు
4. తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు
నమ్మకమై యున్నట్టి - పెండ్లి కుమారుడు
5. దేవుని వాక్యమను - నామము గలవాడు
రక్తములో ముంచిన - వస్త్రమున్ ధరియించె
6. ప్రేమించి సంఘముకై - ప్రాణంబునిడె ప్రభువు
పరిశుద్ధ పరచుట కొరకై - తానప్పగించుకొనెన్
7. శ్రీయేసుక్రీస్తుండే - సంఘంబునకు శిరస్సు
వాక్య ఉదకముతోడ - శుద్ధిపరచుచుండె


Your favourites

  • No Favourites found!