గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి
1. సర్వాధి కారియు – సర్వోన్నతుండైన
మన తండ్రిని ఘనపరచి – మన ముత్సహించెదము
2. సిద్ధపడెను వధువు – సుప్రకాశము గల
నిర్మల వస్త్రములతో – నలంకరించు కొనెన్
3. పరిశుద్ధుల నీతి – క్రియలే యా వస్త్రములు
గొఱ్ఱె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు
4. తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు
నమ్మకమై యున్నట్టి – పెండ్లి కుమారుడు
5. దేవుని వాక్యమను – నామము గలవాడు
రక్తములో ముంచిన – వస్త్రమున్ ధరియించె
6. ప్రేమించి సంఘముకై – ప్రాణంబునిడె ప్రభువు
పరిశుద్ధ పరచుట కొరకై – తానప్పగించుకొనెన్
7. శ్రీయేసుక్రీస్తుండే – సంఘంబునకు శిరస్సు
వాక్య ఉదకముతోడ – శుద్ధిపరచుచుండె
