Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గుర్తుండిపోయే ఈ క్షణాలలో Telugu Christian Song Lyrics

గుర్తుండిపోయే ఈ క్షణాలలో Lyrics

గుర్తుండిపోయే ఈ క్షణాలలో
ప్రతి గుండె నిండా ఆనందమే
ఘనమైన ఈ వివాహ వేడుక
చేసావు మాకు తీపి జ్ఞాపిక
దేవా నీకు వందనం (4)

చిన్ని మొగ్గలా లేత సిగ్గులా
చిరునవ్వుల ఈ నవ వధువు
నింగి చుక్కలా కాంతి రేఖలా
సుందరుడు ఈ నవ వరుడు (2)
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని        ||గుర్తుండిపోయే||

నీ బాటలో నీ మాటలో
సాగనీ అనురాగమై
నీ ధ్యాసలో నీ ఊసులో
ఎదగనీ అనుబంధమై (2)
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని       ||గుర్తుండిపోయే||

Your favourites

  • No Favourites found!