హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్ని వేళల యందున నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
1. వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే
నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
2. నాదు శత్రువులను - పడద్రోయు వాడవు నీవే
మహా సామార్థ్యుడవు - నా రక్షణ శృంగము నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
3. ఎందరు నిను చూచిరో – వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నే వేలుగొందితిన్ – నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
4. భయమును పారద్రోలి - అభయము నిచ్చితివి
ఎబినేజరు నీవై ప్రభు - నన్ను సంరక్షించుచుంటివి
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
5. కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును
నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
6. ఈ జీవిత యాత్రలో - ఏమి సంభవించిన
మహిమా నీకే ఓ ప్రభూ - ఇదియే నా దీన ప్రార్థనా
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ Lyrics
Your favourites
- No Favourites found!
