హే ప్రభుయేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా
పాపహరా, శాంతికరా ||హే ప్రభు||
1. శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ శాంతి స్వరూపా,
జీవనదీపా శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||
2. తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా విఫలులు
జేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా ||సిల్వధరా||
3. మతములు వెదకిన నిన్నెగదా వ్రతములు గోరిన నిన్నెగదా పతి తులు
దేవుని సుతులని నేర్పిన హితమతి వీవెగదా ||సిల్వధరా||
4. పలుకులలో నీ శాంతి కధ తొలకరి వానగ గురిసెగదా మలమల
మాడిన మానవహృదయము కలకలాడెకదా ||సిల్వధరా||
5. కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత మానవ మైత్రిని
సిల్వపతాకము దానము జేసెగదా ||సిల్వధరా||
6. దేవుని బాసిన లోకములో చావుయె కాపురముండెగదా దేవునితో
సఖ్యంబును జగతికి యీవి నిడితివి గదా ||సిల్వధరా||
7. పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండెగదా దాపున జేరి
పాపిని బ్రోచిన కాపరి వీవెగదా ||సిల్వధరా||
8. ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవెగదా ఖలమయుడగు
సాతానుని గర్వము ఖండనమాయెగదా ||సిల్వధరా||
9. కలువరిలో నీ శాంతి సుధా సెలయేఱుగ బ్రవహించెగదా కలుష
ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా ||సిల్వధరా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
హే ప్రభుయేసు హే ప్రభు యేసు Lyrics
Your favourites
- No Favourites found!
