Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా Telugu Christian Song Lyrics

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా Lyrics

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా       ||హే ప్రభు||

శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవనదీపా (2)
శాంతి సువార్తనిధీ         ||సిల్వధరా||

తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా (2)
విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)
సఫలత నీవెగదా        ||సిల్వధరా||

మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా (2)
పతితులు దేవుని సుతులని నేర్పిన (2)
హితమతి వీవెగదా       ||సిల్వధరా||

పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా (2)
మలమల మాడిన మానవ హృదయము (2)
కలకలలాడె కదా       ||సిల్వధరా||

కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత (2)
మానవ మైత్రిని సిల్వ పతాకము (2)
దానము జేసెగదా        ||సిల్వ ధరా||

దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా (2)
దేవునితో సఖ్యంబును జగతికి (2)
యీవి నిడితివి గదా        ||సిల్వ ధరా||

పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా (2)
దాపున జేరి పాపిని బ్రోచిన (2)
కాపరి వీవెగదా        ||సిల్వ ధరా||

ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా (2)
ఖలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా        ||సిల్వ ధరా||

కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా (2)
కలుష ఎడారిలో కలువలు పూయుట (2)
సిలువ విజయము గదా           ||సిల్వ ధరా||

Your favourites

  • No Favourites found!