Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హీనమైన బ్రతుకు నాది – ఘోర Telugu Christian Song Lyrics

హీనమైన బ్రతుకు నాది – ఘోర Lyrics

హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2)
దాపు జేరితిని శరణు కోరితిని
దిక్కు నీవే నాకు ఇలలో
లేరు ఎవ్వరు నాయను వారు      ||హీనమైన||

మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత
మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2)
కరుణించి నన్ను కష్టాలు బాపు (2)
కరుణామయా క్రీస్తేసువా      ||హీనమైన||

తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ
భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2)
పాపి కొరకు ప్రాణమర్పించిన (2)
త్యాగ శీలివి నీకే స్తోత్రము        ||హీనమైన||

నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు
లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు (2)
వెరువను జడియను (2)
నీ కంటి పాపను నను కాచే దైవమా         ||హీనమైన||

Your favourites

  • No Favourites found!