Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హోలీ హోలీ హోలీ హోలీ హోలీ Telugu Christian Song Lyrics

హోలీ హోలీ హోలీ హోలీ హోలీ Lyrics

హోలీ హోలీ హోలీ హోలీ హోలీ హోలీ హోలీ హోలీ
హోలీ హోలీ హోలీ హోలీ హోలీ.... యు ఆర్ హోలీ
హోలీ హోలీ హోలీ హోలీ హోలీ.... యు ఆర్ హోలీ
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
నీ రక్తమిచ్చి ఆ .. ప్రాణమిచ్చి ఆ .. మమ్ములను కొన్నావే
ప్రతి జనములో ఆ .. నీ ప్రజలను ఆ .. నీ యాజక రాజ్యము చేసావే ..
రక్షణ ఘనము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే
రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే...
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
1 అన్నిటికి పైనున్నావు అందరిని చూస్తున్నావు అధికారము ఇచ్చే మహాదేవుడవు
ఆకాశ భూముల యందు ఈ సృష్టి సర్వము నందు నీ చిత్తము జరిగించే మహారాజు నువ్వు
నీ రాజ్యము నిలుచును నిరతము నీదేగా సర్వాధికారము
నీవెవరికి ఇత్తువో వారిదే అవును భూ రాజ్యము.. ఓహో .... ఓ
మహోన్నతుడు యేసుని శుద్దులదే ఈ అధికారము .. ఓహో .... ఓ
రక్షణ ఘనము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే ..
రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
2 దృశ్యములు అదృశ్యములు ఆకాశ భూజల జీవులు అన్నియును నీయందే సృజియింపబడెన్
సింహాసన ప్రభుత్వములు ప్రధానులు అధికారములు అందరును నీ శాసనముకు లోబడును
నీ మాటతో యేలేడి ప్రభుడవు నీ ఒకడివే సృష్టికి కర్తవు
పరలోక పెద్దలందరు తమ కిరీటము తీసి నిన్ను కొలుతురే.. ఓహో .... ఓహో ....
భూరాజులు నివాసులు తమ మహిమనంత తెచ్చి పూజింతురే .. ఓహో .... ఓహో ....
రక్షణ ఘనము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే ..
రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
3 దావీదు చిగురువు నువ్వు యూదా స్తుతి సింహము నువ్వు దావీదు తాళపు చెవి యజమానుడవు
నువ్వు తలుపును మూశావంటే తెరిచేటి వారే లేరు నువ్వు తెరిచిన తలుపును మూసేవారెవరు...
నీ భుజములపై రాజ్య భారము నీదేగా నిత్య సింహాసనము
భూరాజ్యములన్నింటిని కూలగొట్టి నిలుచును నీ రాజ్యము.. ఓహో .... ఓహో ....
నిను విశ్వసించు వారికే చెందుతుంది నీ సత్య రాజ్యము .. ఓహో .... ఓహో ....
రక్షణ ఘనము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే ..
రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
4 సేరాపులు కెరూబులచే పరిశుద్దుడు పరిశుద్దుడని తరతరములు కొనియాడబడే శుద్ధుడవు
నీ స్తుతిని ప్రచురము చేయ మమ్మును నిర్మించావయ్య మా ఆరాధనకు నీవే యోగ్యుడవు
నీ నామము బహు పూజనీయము ప్రతి నామమునకు పైనామము
ప్రతివాని మోకాలును ప్రభు యేసు నామమందున వంగును .. ఓహో .... ఓహో ....
ప్రతి నాలుక యేసుడే అద్వితీయ ప్రభువని ఒప్పును .. ఓహో .... ఓహో ....
రక్షణ ఘనము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే ..
రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా

Your favourites

  • No Favourites found!