Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హోలీ హోలీ… హోలీ హోలీ… హోలీ Telugu Christian Song Lyrics

హోలీ హోలీ… హోలీ హోలీ… హోలీ Lyrics

హోలీ హోలీ… హోలీ హోలీ… (2)
హోలీ హోలీ హోలీ హోలీ
హోలీ… యు ఆర్ హోలీ (2)
వధియింపబడిన గొర్రెపిల్లా – సింహాసనాసీనుడా (2)
నీ రక్తమిచ్చి… ప్రాణమిచ్చి… మమ్ములను కొన్నావే
ప్రతి జనములో… నీ ప్రజలను… నీ యాజక రాజ్యము చేసావే
రక్షణ జ్ఞానము స్తోత్రము – శక్తియు ఐశ్వర్యము నీదే
రాజ్యము బలము ప్రభావము – మహిమ ఘనత నీదే
అర్హుడా.. యోగ్యుడా.. కృతజ్ఞతకు పాత్రుడా (2) ||వధియింప||
అన్నిటికి పైనున్నావు – అందరిని చూస్తున్నావు
అధికారం ఇచ్చే మహా దేవుడవు
ఆకాశ భూములయందు ఈ సృష్టి సర్వమునందు
నీ చిత్తము జరిగించే మహారాజు నువ్వు
నీ రాజ్యము నిలుచును నిరతము
నీదేగా సర్వాధికారము
నీవెవ్వరికి ఇత్తువో వారిదే ఔను భూ రాజ్యము
మహోన్నతుడు యేసుని శుద్ధులదే ఈ అధికారము ||రక్షణ||
దృశ్యములు అదృశ్యములు – ఆకాశ భూజల జీవులు
అన్నియును నీ యందే సృజియింపబడెన్
సింహాసన ప్రభుత్వములు – ప్రధానులు అధికారములు
అందరును నీ శాసనముకు లోబడును
నీ మాటతో ఏలెడి ప్రభుడవు
నీవొకడివే సృష్టికి కర్తవు
పరలోక పెద్దలందరు తమ కిరీటము తీసి నిన్ను కొలుతురే
భూ రాజులు నివాసులు తమ మహిమనంతా తెచ్చి పూజింతురే ||రక్షణ||
దావీదు చిగురువు నువ్వు – యూదా స్తుతి సింహము నువ్వు
దావీదు తాళపు చెవి యజమానుడవు
నువ్వు తలుపును మూసావంటే – తెరిచేటి వారే లేరు
నువ్వు తెరిచిన తలుపును మూసే వారెవరు
నీ భుజములపై రాజ్య భారము
నీదేగా నిత్య సింహాసనము
భూరాజ్యములన్నింటిని కూలగొట్టి నిలుచును నీ రాజ్యము
నిను విశ్వసించు వారికే చెందుతుంది నీ సత్య రాజ్యము ||రక్షణ||
సెరాపులు కెరూబులచే – పరిశుద్ధుడు పరిశుద్ధుడని
తరతరములు కొనియాడబడే శుద్ధుడవు
నీ స్తుతిని ప్రచురము చేయ – మమ్మును నిర్మించావయ్యా
మా ఆరాధనకు నీవే యోగ్యుడవు
నీ నామము బహు పూజనీయము
ప్రతి నామమునకు పై నామము
ప్రతి వాని మోకాలును ప్రభు యేసు నామమందున వంగును
ప్రతి నాలుక యేసుడే అద్వితీయ ప్రభువని ఒప్పును ||రక్షణ||

Your favourites

  • No Favourites found!