Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హృదయాలనేలే రారాజు యేసువా అధరాలపై నీ Telugu Christian Song Lyrics

హృదయాలనేలే రారాజు యేసువా అధరాలపై నీ Lyrics

హృదయాలనేలే రారాజు యేసువా
అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)
నీ కొరకే నేను జీవింతును
నా జీవితమంతా అర్పింతును ||హృదయాల||
నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి
నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)
నా దరికి చేరి నన్ను ప్రేమించినావా
నన్నెంతో ఆదరించి కృప చూపినావా
నా హృదయనాథుడా నా యేసువా
నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల||
నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2)
పరలోక మార్గాన నడిపించు నా ప్రభు
అరణ్య యాత్రలోన నిన్నానుకొందును
అతిలోక సుందరుడా శ్రీ యేసువా
రాజాధిరాజా ఘన యేసువా ||హృదయాల||

Your favourites

  • No Favourites found!