హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధుండు నిలచి సదయుఁ
డగుచుఁ దట్టుచుండు సకల విధములను ||హృదయ||
1. పరుని బోలి నిలుచున్నాఁడు పరికించి చూడ నతఁడు పరుఁడు గాఁ
డు రక్షకుండు ప్రాణ స్నేహితుఁడు ||హృదయ||
2. కరుణాశీలుం డతఁడు గానఁ గాచి యున్నాఁడు యేసు కరుణ నెఱి
గి గారవింపఁ గరము న్యాయంబు ||హృదయ||
3. ఎంత సేపు నిలువఁ బెట్టి యేడ్పింతు రతని నాతఁ డెంతో దయచే
బిలుచుచున్నాఁ డిప్పుడు మిమ్ములను ||హృదయ||
4. అతఁడు మిత్రుఁడతఁడు మిత్రుం డఖిల పాపులకు మిర లతని
పిలుపు వింటి రేని యతఁడు ప్రియుఁడగును ||హృదయ||
5. జాలిచేతఁ దన హస్తములఁ జాఁపి యున్నాఁడు మిమ్ము నాలిం
గనము సేయఁ గోరి యనిశము కనిపెట్టు ||హృదయ||
6. సాటిలేని దయగల వాఁడు సర్వేశు సుతుఁడు తన మాట వినెడు
వారల నెల్ల సూటిగ రక్షించు ||హృదయ||
7. చేర్చుకొనుఁడి మీ హృదయమున శ్రీ యేసునాధు నతఁడు చేర్చు
కొనుచు మీ కిచ్చును చిర జీవముఁ గృపను ||హృదయ||
8. అతఁడు తప్పక కలుగఁజేయు నఖిల భాగ్యములు మీర లతని
హత్తుకొందు రప్పు డానందముతోడ ||హృదయ||
9. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడఁ గాన బ్రతికి యుండు
కాలముననే ప్రభుని గొలువండి ||హృదయ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధుండు Lyrics
Your favourites
- No Favourites found!
