Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హృదయపూర్వక ఆరాధన మహిమ రాజుకే సమర్పణ Telugu Christian Song Lyrics

హృదయపూర్వక ఆరాధన మహిమ రాజుకే సమర్పణ Lyrics

హృదయపూర్వక ఆరాధన
మహిమ రాజుకే సమర్పణ (2)
నిత్యనివాసి సత్యస్వరూపి
నీకే దేవా మా స్తుతులు (2) ||హృదయ||
నా మనసు కదిలించింది నీ ప్రేమ
నా మదిలో నివసించింది నీ కరుణ
ఎంతో ఉన్నతమైన దేవా (2)
క్షేమాధారము రక్షణ మార్గము
మాకు సహాయము నీవేగా (2) ||హృదయ||
ఆత్మతో సత్యముతో ఆరాధన
నే బ్రతుకు కాలమంతా స్తుతి కీర్తన
నీకై పాడెదను యేసయ్యా (2)
కృపామయుడా కరుణ సంపన్నుడా
నిత్యము నిన్నే పూజింతును (2) ||హృదయ||

Your favourites

  • No Favourites found!