Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణముదేవుని చిత్తములో Telugu Christian Song Lyrics

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణముదేవుని చిత్తములో Lyrics

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2)
వివాహమన్నది అన్నింట ఘనమైనది
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2)
ఒంటరైన ఆదామును చూసి
జంట కావాలని మది తలచి (2)
హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను
సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2) ||వివాహమన్నది||
ఏక మనసుతో ముందుకు సాగి
జీవ వృక్షముకు మార్గము ఎరిగి (2)
సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని
సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం (2) ||వివాహమన్నది||
భార్య భర్తలు సమానమంటూ
ఒకరి కోసము ఒకరనుకుంటూ (2)
క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి
సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి (2) ||వివాహమన్నది||

Your favourites

  • No Favourites found!