Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇది న్యాయమా? – ఇది ధర్మమా? Telugu Christian Song Lyrics

ఇది న్యాయమా? – ఇది ధర్మమా? Lyrics

ఇది న్యాయమా? – ఇది ధర్మమా?
శ్రీయేసు వార్తను – దాచుట
నశియించు ఆత్మలన్ – దోచుట      [ ఇది ]

1.  యేసుని నామములో – రక్షణ వుందట
   ఆ యేసుని నమ్మనిచో – నరకం తప్పదట (2)
   అది తెలిసిన మీరు  – తెలియని మాకు
   ఆ వార్తను దాచుట- న్యాయమా?
   మా ఆత్మలు దోచుట – ధర్మమా?   [ ఇది ]

2.  ప్రకటించిన చోటే – ప్రకటిస్తున్నారే
   విన్నవారికే మళ్ళీ – వినిపిస్తున్నారే    (2)
   పల్లెలను మరచి – ప్రభు ఆత్మను విడచి
   పరిచర్య చేయుట – న్యాయమా?
   పట్టణాలలో తిరుగుట – ధర్మమా?    [ ఇది ]

Your favourites

  • No Favourites found!