ఇదిగో నా శిష్యులారా యెఱుక లుంచుఁడి మోక్ష సదనమున కేను
బోదు సంతోషించు(డి ||ఇదిగో||
1. యెరూషలేమందుండి మీ రెదురు చూడుఁడి మీపైఁ బరిశుద్ధాత్మయు
దిగివచ్చి పనులు దెల్పును ||ఇదిగో||
2. దిక్కులేనట్లు మిమ్ము దిగనాడి పోను మీతో మక్కువైయుండఁ
బరిశు ద్ధాత్మను బంపెదను ||ఇదిగో||
3. నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు నాతో సర్వకాలము నిత్య
సామ్రాజ్యము నేల ||నిదిగో||
4. ఒకరితో నొకరు ప్రియము లొప్పి యుండుఁడి నాదు సకలాజ్ఞలందు
నిదియె సార మనుకొనుఁడి ||యిదిగో||
5. ఏదైననా పేరిటమీ రించుక వేఁడినను మీకు మోదముతోడదాని
ముందే చేయుదును ||ఇదిగో||
6. ఉల్లము లందుఁ గలఁత లెల్ల విడువుఁడి నేను మళ్లి వచ్చెడి విధము
మరువకుండుఁడి ||యిదిగో||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఇదిగో నా శిష్యులారా యెఱుక లుంచుఁడి Lyrics
Your favourites
- No Favourites found!
