ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి
సంతోషించు యెరుషలేం కుమారి ఉల్లసించు ||ఇదిగో||
1. నీదురాజు నీతితో దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు వచ్చు చుండె ||ఇదిగో||
2. రక్షణగలవాడుగ అక్షయుండగు యేసుడు
ఇచ్చతోడ యెరుషలేం వచ్చు చుండె ||ఇదిగో||
3. స్వాతికుండు యీభువిన్ అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై వచ్చుచుండె ||ఇదిగో||
4. దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె ||ఇదిగో||
5. ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు వచ్చుచుండె ||ఇదిగో||
6. దావీదు కుమారుడు దేవుడు పాపులకు
జయగీతములతో వచ్చుచుండె ||ఇదిగో||
7. యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము
యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ వచ్చుచుండె ||ఇదిగో||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను Lyrics
Your favourites
- No Favourites found!
