Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి Telugu Christian Song Lyrics

ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి Lyrics

ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను
నిలిచి మది తమోగుణంబులణపె సదమల జ్ఞానంబు నొసఁగె ||ఇదిగో||

1. ఎవని జ్ఞానమహిమ విభవ మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ
రూపమాయె నవనీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి ||ఇదిగో||

2. నరజనముల నీతియెవడో ధరణిపతుల దీప్తియెవడో దురితఋణము
దీర్చునెవఁడో పరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ మొసగునిపుడె
||ఇదిగో||

3. కలుష మెల్ల బాపదలఁచి కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి
గూర్చన్ సిలువమీద బలియై మరణ బలముణఁచి తిరిగిలేచె ||ఇదిగో||

4. మదితమం బదెచటికరిగె యెదను కఠినతము కరిగె హృదయరసము
లతిశయించి సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె
||ఇదిగో||

5. జనగణముల జీవమతఁడె ధనఘనముల దాతయతఁడె యనుభవమున
నెఱుఁగుమతని యనుపమ ప్రేమా మృతంబు ననవరతా నందకరము
||ఇదిగో||

Your favourites

  • No Favourites found!