Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇదిగో శుభద రక్షణము దేవుఁడు పంపె Telugu Christian Song Lyrics

ఇదిగో శుభద రక్షణము దేవుఁడు పంపె Lyrics

ఇదిగో శుభద రక్షణము దేవుఁడు పంపె నిదిగో శుభద రక్షణము
సదమలంబగు పూర్వ సత్యవాక్యమునందు మృదువుగా దీర్ఘ ద ర్శుల
చేతఁ బలుకఁబడె ||ఇదిగో||

1. అలపిశాచముతోడను దేవుఁడు తొల్లిఁ బలుకు వాక్యము జాడను
పొలతి సంతతి నిన్ను తలఁగొట్ట బుట్టునని తెలియఁజేసెను మోషె
దీర్ఘ దర్శన వాక్య ||ఇదిగో||

2. ఘన దివ్య బలిచేయను పాపములెల్లఁ దునిమి పుణ్యము లియ్యను
ఒనరఁగ నీ కాల మునఁ గ్రీస్తు వచ్చునని మును దానియేలు బ ల్కెను
దీర్ఘ దర్శనము ||ఇదిగో||

3. యూద రాజ్యములోపట బెత్లేమనెడి యూరఁ గ్రీస్తుడు బుట్టుట
ఆదిలోన మీకా యను దీర్ఘ దర్శిచే మోదమునఁ దెల్పబడె ముందు
వేదమునందు ||ఇదిగో||

4. మన దోషముల కొఱకునై యేసుని కాయ మది గాయముల హ్రస్వమై
మన రక్షకుని పాట్లు గనినట్టుల యెషయ్య మును దెల్పె దీర్ఘద ర్శన
వాక్యముల నిచ్చి ||ఇదిగో||

Your favourites

  • No Favourites found!