ఇదియేనయ్య మా ప్రార్థన
ఇదియే మా విజ్ఞాపన
ఆలకించే దేవా
మము నీ ఆత్మతో నింపగా రావా (2)
నీ వాక్యములో దాగియున్న
ఆంతర్యమును మాకు చూపించయ్యా
నీ మాటలలో పొంచియున్న
మర్మాలను మాకు నేర్పించయ్యా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా||
నీ దృష్టిలో సరిగా జీవించే
మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా
నీ సృష్టిని మరిగా ప్రేమించే
లోబడని మా మనసుల సరిచేయయ్యా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఇదియేనయ్య మా ప్రార్థన ఇదియే మా Lyrics
Your favourites
- No Favourites found!
