Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇదియే సమయంబు రండి యేసుని జేరండిఇక Telugu Christian Song Lyrics

ఇదియే సమయంబు రండి యేసుని జేరండిఇక Lyrics

ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయము లేదండి రండి రక్షణ నొందండి

1. పాపులనందరిని తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా ||ఇక||

2. రాజుల రాజైన యేసు రానై యుండేనుగా
గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
తరుణముండగానే మీరు తయ్యారవ్వండి ||ఇక||

3. బుద్ధి లేని కన్యకలవలె మొద్దులుగానుంటె
సిద్దెలలో నూనెపోసి సిద్ధపడకపోతే
తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి ||ఇక||

4. వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు
తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండీ
మిమ్మును ఎరుగను మీరెవరో పొమ్మనును ||ఇక||

5. సందియ పడకండి మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ ||ఇక||

6. సందియ పడకండి మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ ||ఇక||

7. జాలము చేయకను మెరు హేళన చేయకను
కులము స్థలమనుచూ మీరు కాలము గడువకనూ
తరుణముండగానే మీరు త్వరపడి రారండి ||ఇక||

Your favourites

  • No Favourites found!