Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే Telugu Christian Song Lyrics

ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే Lyrics

ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే ధన్య మన్న తులలేని
భక్తి మీర చెలువైన రక్తి దీర నలలారు కూరిమితో మరి పేరి మితో
మెలంగినచో నెలమిని బ్రభుఁ డిడుఁ బలు దీవెనల ||నిల||

1. పొడగాంచి చుక్క జ్ఞానులు కరము నడిచి నడచి కానుకలు నిడి
బాలనృపునిమ్రోల పడి మ్రొక్కి మోడ్చి కేలఁ గడు నిత్యభాగ్యమును
సౌభాగ్యమును గడించికదా వెడలి రమందానందముతోడ ||నిల||

2. మును పేద విధవ చాల భక్తి నొనరంగ గుడి చందాలఁ దన జీవనం
బై యుండు నెనరాని కాసుల రెండు మనసార నర్పించె సమర్పించె
మనశ్శాంతిన్ గని యెను క్రీస్తుని వరముల బడసె ||నిల||

3. తనయ నీదు హృదయంబు నాకి మ్మనె దేవుఁడె యనయంబు మన
సొప్పి మన కానుకల మారాడక మన సకల మును నీయఁ గావలయున్
బ్రభుడాయవలెన్ మనం బలరన్ సణుగక గొణుగక వర్ధిల్లు కొలఁది ||నిల||

Your favourites

  • No Favourites found!