Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగుఓ Telugu Christian Song Lyrics

ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగుఓ Lyrics

చరనం 1
ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు
ఓ పాపి యందు మున్గుము - పాపంబు పోవును
పల్లవి

యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్తమెప్పుడు - శ్రవించు నాకుగా (x2)
చరనం 2

ఆ యూట మున్గి దొంగయు - హా శుధ్ధుడాయెను
నేనట్టి పాపినిప్పుడు - నేనందు మున్గుదున్ ||యేసుండు||
చరనం 3
నీ యొక్క పాపమట్టిదే - నిర్మూలమౌటకు
రక్షించు గొర్రెపిల్ల - నీ రక్తము చాలును ||యేసుండు||
చరనం 4
నా నాధు రక్తమందున - నే నమ్మియుండినన్
నా దేవుని నిండు ప్రేమ - నేనందు చూచేదన్ ||యేసుండు||
చరనం 5

నా యాయుష్కాలమంతట - నా సంతసంబిదే
నా క్రీస్తుయొక్క రొమ్మునన్ - నా గానమిదియే ||యేసుండు||

Your favourites

  • No Favourites found!