Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇమ్మానుయేలుని రక్తము నిండిన ఊటయేఇమ్ముగ దోషములెల్ల Telugu Christian Song Lyrics

ఇమ్మానుయేలుని రక్తము నిండిన ఊటయేఇమ్ముగ దోషములెల్ల Lyrics

1. ఇమ్మానుయేలుని రక్తము - నిండిన ఊటయే
ఇమ్ముగ దోషములెల్ల - నివృత్తి చేయును
హల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్
2. పాపాత్ముడైన దొంగయు - ఆ ఊటలోముంగి
మన్నింపు, మోక్షానందము - నొందియానందించెన్
3. ఆలాగే నేను యేసుచే - విముక్తి పొందుదు
విలువైన మన్నింపునొంది - పాడుదును సదా
4. గాయంపు రక్తమును నే - విశ్వసించి చూచి
ప్రియంపు యేసు ప్రేమను - ప్రకటింతు నెల్లడన్
5. మోక్షంబునందు రక్షకున్ - చూచి ప్రహర్షింతున్
రక్షించునట్టి ప్రేమను - రక్తితో పాడుదున్


Your favourites

  • No Favourites found!