Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించవయ్యా నీ బాహువు మాకు Telugu Christian Song Lyrics

ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించవయ్యా నీ బాహువు మాకు Lyrics

ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించవయ్యా
నీ బాహువు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా
నీ కృప చేత కీడుల నుండి తప్పించవయ్యా..
ఎడబాయని నీ కృప మా యెడల చూపావేసయ్యా

నీకే ఆరాధన చెల్లించెద యేసయ్య
నీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్య  (2)
                                    || ఇన్నేళ్ళుగా ||
1. నీ వాత్సల్యము చేత మమ్మును నడిపించావు..
దినదినము నీ కృప చూపి నీలో భద్రపరిచావు (2)
ఏ తెగులైనా తాకనీయక సంరక్షించావు
మా కన్నీటిని తుడిచి ఆదరణగ నిలిచావు (2)

నీకే ఆరాధన చెల్లించేద యేసయ్య
నీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్య  (2)
                                    || ఇన్నేళ్ళుగా ||
2. ఎన్ని యుగాలకైనా నీవే మా దైవము
మా ఆయుష్కాలము వరకు నిన్నే పూజింతుము(2)
పరిశుద్ధుడా.. అతి పరిశుద్ధుడా.. మా ప్రభు యేసయ్య
ఈ విశ్వములోనా నీకు సాటి లేనే లేదయ్యా(2)

నీకే ఆరాధన చెల్లించేద యేసయ్య
నీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్య  (2)
                                    || ఇన్నేళ్ళుగా ||

Your favourites

  • No Favourites found!