Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావుఇమ్మానుయేలుగా వెన్నంటి Telugu Christian Song Lyrics

ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావుఇమ్మానుయేలుగా వెన్నంటి Lyrics

ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు
అ.ప.:ఇశ్రాయేలు కాపరీ నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము
1.ఘనులైన వారే గతియించగా - ధనమున్నవారే మరణించగా
ఎన్నతగనివారమైన మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు
2.మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మాదరికి చేరకుండగా
కంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు
3.ఈ లోక యాత్రలో సాక్షులుగా
నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా
ఎట్టి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావు
నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు

Your favourites

  • No Favourites found!