ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2)
||ఇంత కాలం||
1. ఎన్ని ఏళ్ళు గడచినా
ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2)
||ఇంత కాలం||
2. నీవు చేసిన మేలులు
తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2)
||ఇంత కాలం||
3. దూరమైతిరి ఆప్తులు
విడచిపోతిరి నా హితులు (2)
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2)
||ఇంత కాలం||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా Lyrics
Your favourites
- No Favourites found!
