Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇరువది నలుగురు పెద్దలతోపరిశుద్ధ దూతల సమూహముతో Telugu Christian Song Lyrics

ఇరువది నలుగురు పెద్దలతోపరిశుద్ధ దూతల సమూహముతో Lyrics

ఇరువది నలుగురు పెద్దలతో
పరిశుద్ధ దూతల సమూహముతో (2)
నాలుగు జీవుల గానంతో (2)
స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది||
భూమ్యాకాశములన్నియును
పర్వత సముద్ర జల చరముల్ (2)
ఆకాశ పక్షులు అనుదినము (2)
గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది||
కరుణారసమగు హృదయుడవు
పరిశుద్ధ దేవ తనయుడవు (2)
మనుజుల రక్షణ కారకుడా (2)
మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది||
గుప్పిలి విప్పి కూర్మితోను
గొప్పగ దీవెనలిచ్చెదవు (2)
గొర్రెల కాపరి దావీదు (2)
అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది||

Your favourites

  • No Favourites found!