Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇతరుల సాక్ష్యము లెంతో గలిగియున్న మరి Telugu Christian Song Lyrics

ఇతరుల సాక్ష్యము లెంతో గలిగియున్న మరి Lyrics

ఇతరుల సాక్ష్యము లెంతో గలిగియున్న మరి సాక్ష్యమే మంచిది
మృతిబొందిలేచియు న్నతమోక్ష రాజ్యాధి పతియై యున్న యేసు ప్రభువే
మా విభుఁడైన ||నితరుల||

1. గురి సిలువ దెస మాకు స్థిరమై నిలిచియున్న దురితము తలయెత్తునే
మరి యేసు ప్రక్కలో చొరఁబారి యందున్న కరుణారసము గ్రోలు
టెఱిఁగి యుండిన చాలు ||నితరుల||

2. తలవాల్చుటకు తనకు స్థలము లే దనునట్టి పలుకే మా కైశ్వర్యము
బలమిచ్చి యెదిగించు ప్రభు వాగ్దత్తములే మా కిలలో పంచభక్ష్య
ములుగా నుండిన చాలు ||నితరుల||

3. బెదిరించి సైతాను కదిలింపలేనట్టి కుదురైన విశ్వాసము బొదలుచు
మాలో నిం పొదవుచుండిన చాలు మదిలో నెమ్మది యిచ్చు మా యేసు
కృప గల్గ ||నితరుల||

Your favourites

  • No Favourites found!