Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల  Telugu Christian Song Lyrics

ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల Lyrics

ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2)
ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల||

నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది
జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2)
గుండు సూదికి గ్యారెంటి ఉంది
నీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల||

ఎం ఏ చదువులు చదివే అన్న
బి ఏ చదువులు చదివే అన్న (2)
ఎం ఏ చదువులు ఏటి పాలురా
బి ఏ చదువులు బీటి పాలురా (2) ||ఇయ్యాల||

మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా
అందం చందం ఎంత ఉన్నా (2)
యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా
ఎన్ని ఉన్నా అన్ని సున్నా (2) ||ఇయ్యాల||

సబ్సే బడా రూపాయంటావు
రూపాయీ అన్నిస్తదంటావు (2)
రూపాయీ పరలోకమివ్వదు
రూపాయీ సంతోషమివ్వదు (2) ||ఇయ్యాల||

Your favourites

  • No Favourites found!