Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇయ్యుడి మీకియ్యబడునని ఇయ్యగల శ్రీ యేసు Telugu Christian Song Lyrics

ఇయ్యుడి మీకియ్యబడునని ఇయ్యగల శ్రీ యేసు Lyrics

ఇయ్యుడి మీకియ్యబడునని ఇయ్యగల శ్రీ యేసు ప్రభువు నెయ్యముతో
తన శిష్యవితతికి నయముమీర జెప్పినట్లు ||ఇయ్యుడి||

1. మొదట పరముని నంతునియ్యరే సదమల హృదయంబుతోడ సదయు
డగు మన పరమతండ్రి ముదమతోడ నంతయు నిచ్చున్ ||ఇయ్యుడి||

2. శక్తికొలది నియ్యవలెనని భక్తులందరితోడా జెప్పె భక్తితోడ ప్రభుని సేవకు
శక్తికొలది నియవలెను ||ఇయ్యుడి||

3. కొంచెముగ విత్తెడివారు కొంచెము సమకూర్చెదరు హెచ్చువిత్తెడి
వారికిలను హెచ్చు ఫలములు నిండుగ దొరుకున్ ||ఇయ్యుడి||

4. సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో బ్రోచున్ వింతగా
దీవెనలతోడ అంతయు దయచేసి బ్రోచున్ ||ఇయ్యుడి||

5. యేసు కృపను ఎరిగిమనుడి యేసు మార్గమునందు నడువుడి దాసుడై
ధనమంత విడిచె నీచులకొరకిలను మున్నె ||ఇయ్యుడి||

6. పరమనిధులను నింపుకొనుడి పరమ దేవుని ప్రేమను గనుడి పరమ
నిధులలో చిమ్మెటుండదు దొంగలసలే లేరుసుమండి ||ఇయ్యుడి||

Your favourites

  • No Favourites found!