Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జాగ్రత్త భక్తులారా పిలుపిదే ప్రభు యేసు Telugu Christian Song Lyrics

జాగ్రత్త భక్తులారా పిలుపిదే ప్రభు యేసు Lyrics

జాగ్రత్త భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును
వందనం హోసన్న రాజాధి రాజు వచ్చును
వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము

1. చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగా
విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము

2. గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుము
లోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె

3. మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమి
ఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో

4. దైవజనులు కలుతురు గగనమున ప్రభునందు మృతులు జీవింతురు
మేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు

5. క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును విజయులే దాని పొందెదరు
ప్రీతిగ పల్కును ప్రభువే మనతో నావన్నియు మీవేయనుచు

Your favourites

  • No Favourites found!