Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో Telugu Christian Song Lyrics

జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో Lyrics

జగములనేలే పరిపాలక
జగతికి నీవే ఆధారమా
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము
పాడెద నిరతము ప్రేమగీతము

యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
//జగమునేలే పరిపాలక//

1. మహారాజుగా నా తోడువై
నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నీవు మోయగా
సులువాయే నా పాయనము
నీ దయచేతనే కలిగిన క్షేమము –
ఎన్నడు నను వీడదే (2)
నీ సన్నిధిలో పొందిన మేలు –
తరగని సౌభాగ్యమే  (2) || యేసయ్యా ||

2. సుకుమారుడా నీ చరితము
నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా
నేనెంతో ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభతరుణం –
నాకిది నీ భాగ్యమా (2)
జీవితమంతా నీకర్పించి –
నీ రుణము నే తీర్చనా (2)  || యేసయ్యా ||

3. పరిశుద్ధుడా సారధిమై
నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన
ప్రతి మలుపు నీ చిత్రమే
నా విశ్వాసము నీ పైనుంచి –
విజయము నే చాటనా (2)
నా ప్రతిక్షణము ఈ భావనతో –
గురియొద్దకే సాగెద (2)  || యేసయ్యా ||

Your favourites

  • No Favourites found!