1. జాగ్రత్త జాగ్రత్త - యేసుడిట్లు పిల్చున్
నేడు పో పను చేయి - నాదు వనములో
ఆయనే ముందు వెళ్ళి మా త్రోవ చూపున్
కాగా జాగ్రత్తతో - పని చేయుదము
పని చేయి - కోరుచు కాచుచు
మా యేసు వచ్చు మట్టుకు
2. జాగ్రత్త జాగ్రత్త నీతి నాశించెడు
వారి నందరిని తృప్తి పర్చెదము
యేసు సిలువ నె-త్తి మా ధ్వజముగ
రక్షణ యుచితం-బని చాటింతుము
3. జాగ్రత్త జాగ్రత్త వచ్చి పోరాడుడి
దుష్ట సాతాను రా-జ్యంబు పాడగును
యేసు నామ ప్రఖ్యా-తిని శ్లాఘించుడి
ఆయన రక్షణ యుచితంబగును
4. జాగ్రత్త జాగ్రత్త యేసు శక్తి నిచ్చున్
గెల్చు వారికి జీ-వ కిరీటంబగున్
మోక్షానందములో నివసించువారై
రక్షణ యుచితం-బని పాడెదము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
జాగ్రత్త జాగ్రత్త యేసుడిట్లు పిల్చున్నేడు పో Lyrics
Your favourites
- No Favourites found!
