Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జన్మించె జన్మించె  రారాజు జన్మించెచీకటి Telugu Christian Song Lyrics

జన్మించె జన్మించె రారాజు జన్మించెచీకటి Lyrics

జన్మించె జన్మించె – రారాజు జన్మించె
చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే
అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె
పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే
ఊరు వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని
నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2)
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్
దూతకు భయపడి వణికిరి గొల్లలు
శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి (2)
సంతోషముతో ఆనంద గానముతో
యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2) ||ఊరు వాడా||
తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు
యేసే రాజని అర్పించిరి కానుకలు (2)
ఆరాధించి హృదయములను అర్పించి
భువినేలే రారాజును కీర్తించిరి (2) ||ఊరు వాడా||
యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవము ఇదియే నిత్యము (2)
నీ పాపాలన్నీ క్షమియించేదేసయ్యే
విశ్వసించి నీ హృదయమునే అర్పించుము (2) ||ఊరు వాడా||

Your favourites

  • No Favourites found!