Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయం జయం మన యేసుకే Telugu Christian Song Lyrics

జయం జయం మన యేసుకే Lyrics


జయం జయం మన యేసుకే
మరణం గెలిచిన క్రీస్తుకే (2)
స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము (2)
పునరుత్ధానుడైన క్రీస్తుని
మహిమపరచెదము (2)        ||జయం జయం||

పాపములేని యేసుడు
సిలువలో పాపికై మరణించి (2)
మూడవదినమున – తిరిగి లేచెను (2)
మరణపు ముల్లును విరిచెను (2)        ||జయం జయం||

పాపము చేసి మానవుడు
కోల్పోయిన అధికారమును (2)
సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను (2)
సాతాను బలమును గెలిచెను (2)        ||జయం జయం||

పాపము విడిచి సోదరా
ప్రభు సన్నిధికి రారమ్ము (2)
పునరుత్ధాన శక్తితో నింపి (2)
పరలోకమునకు చేర్చును (2)        ||జయం జయం||

Your favourites

  • No Favourites found!