Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయమని పాడు జయమని పాడు ప్రభుయేసునకే Telugu Christian Song Lyrics

జయమని పాడు జయమని పాడు ప్రభుయేసునకే Lyrics

జయమని పాడు జయమని పాడు ప్రభుయేసునకే
మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే
1. ఆది అంతము అల్ఫ ఓమేగా ఆయనే ప్రభువు
ఆయన యేగా రానున్నవాడు శక్తిమంతుడు
2. ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను
ప్రేమతో మమ్ము పవిత్ర పరచి నిర్దోషులుగ తీర్చె
3. యేసులో మమ్ము రక్తముద్వారా విమోచించితివి
యెంతో కృపతో మమ్మును కడిగి మన్నించి నావుగా
4. యేసులో మాకు యేశిక్షలేదు భయము బాపెగా
వాసిగా మరణబలము తొలగించి పాపము బాపెగా
5. క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపెను
కరుణించి మమ్ము అంగీకరించె ఎంతో అద్భుతము
6. మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మ ముద్ర నిచ్చెను
మనోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణ నచ్చె
7. ప్రభు క్రీస్తులో వాడబారని స్వాస్థ్యముగ నైతిమి
పరిశుద్ధులలో మహిమైశ్వరంబు యెంతో గొప్పది


Your favourites

  • No Favourites found!