Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయప్రభు యేసునె వెంబడించుచు జయముగ నడచెదము Telugu Christian Song Lyrics

జయప్రభు యేసునె వెంబడించుచు జయముగ నడచెదము Lyrics

జయప్రభు యేసునె వెంబడించుచు జయముగ నడచెదము యేసుతో
జయముగ వెడలెదము ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము
జేసెద మా ప్రభు వెంబడి ||జయప్రభు||

1. ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును అవనిలో అందరి రక్షయును
ఆదర్శంబౌ ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగ
||జయప్రభు||

2. ధర విరోధులు మమ్ము జుట్టగ దరి జేరెద మేసున్ ప్రభుని దరిజేరెద
మేము ధాత్రి దురాశల డంబములన్నిటి మైత్రిని వీడి నడచెద మేసుతో
||జయప్రభు||

3. మా ప్రభు జూముము నీదు మార్గపు మాదిరి జాడలను నీ దగు
మాదిరి జాడలను మా పాదములను తొట్రిలకుండగ మా కిడు బలమును
యీ కృపాదినమున ||జయ ప్రభు||

4. మా కొరకై నీవు నడచిన మార్గము జూడగను మేము మార్గము జూడగను
మా రక్షక నీ అడుగుజాడలు మరువక విడువక నడువగ కృపనిడు
||జయప్రభు||

5. ఇహపరముల నినుగాక ప్రేమతో ఎవరిని గొలిచెదము? ఎవరిని ప్రేమింప
వశమె? విహరించెదము యేసుని వెంబడి మహిమ రాజ్యమున యేసుని
గొలువగ ||జయప్రభు||

Your favourites

  • No Favourites found!