Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జీవము గల దేవుని సంఘం Telugu Christian Song Lyrics

జీవము గల దేవుని సంఘం Lyrics

జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యము
మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము
సంకల్పమందున మనముండినా
ఆ సంఘమందున వసియించినా
ఎంతో ఎంతో ధన్యము – (2)        ||జీవము||

యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘము
సత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది (2)
పాతాళలోక ద్వారములు
దాని ఎదుట నిలువవు (2)        ||జీవము||

యేసే శిరస్సైయున్న – శరీరము మనమందరము
పరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు (2)
ఏ నరుడు దేవుని నిలయమును
పాడు చేయకూడదు (2)        ||జీవము||

యవ్వన ప్రాయము మనలో – భవ్యానికి భయపడక
సవ్వడి చేయుచు నిరతం – కవ్వించు చుండును (2)
ప్రభు యేసు దివ్య మాదిరిలో
గమ్యము చేరగా సాగుదాం (2)        ||జీవము||

ఏ ప్రాంతీయుల మైన – మనమందరము సోదరులం
శాశ్వత రాజ్యపు గురిలో – శ్రీ యేసుని సహ వారసులం (2)
లోకాన యేసుని త్యాగమును – సాహసముతో చాటుదాం
లోకాన క్రీస్తుని మహిమను – సహనముతోనే చాటుదాం        ||జీవము||

Your favourites

  • No Favourites found!