Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జీవన తొలి సంధ్య Telugu Christian Song Lyrics

జీవన తొలి సంధ్య Lyrics

జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం

నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2)

నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2)

నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2)         ||జీవన||

నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు

నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2)

నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను

నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2)

దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2)         ||జీవన||

నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు

ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను (2)

నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా

నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా (2)

దేవా నను నీ సాక్షిగ నిల్పుమా (2)         ||జీవన||

Your favourites

  • No Favourites found!