జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2)
1. శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
2. ఎండిన ఎముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
3. కృంగిన సమయములో
నీ కృప దయచేయుమయా(2) ||జీవ నదిని||
4. బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||
5. ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||
