జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవేప్రభు
జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు
జగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడేదనూ…
ఏమని పొగడెదను.. ||జీవప్రధాతవు||
1. శుభకరమైన తొలిప్రేమనునే
మరువక జీవింప కృపనీయ్యవా (2)
కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుకనీవై
జతకలిసినిలచి జీవింపదలచి
కార్చితివి నీ రుధిరమే
నీత్యాగ ఫలితం నీ ప్రేమ మధురం
నా సొంతమే యేసయ్యా ||జీవప్రధాతవు||
2. నేనేమైయున్న నీకృపకాదా
నాతోనిసన్నిధిని పంపవా (2)
ప్రతికూలతలు శృతిమించినను
సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై ఉదయించి నాపై
నడిపించినది నీవయ్యా
నీ కృపకునన్ను పాత్రునిగాచేసి
బలపరచిన యేసయ్యా ||జీవప్రధాతవు||
3. మహిమనుధరించిన యోధులతోకలిసి
దిగివచ్చెదవు నా కోసమే (2)
వేల్పులలోనా బాహుఘనుడవు నీవు
విజయవిహరుల ఆరాధ్యూడవు
విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఎనాడూ పొందని ఆత్మభిషేకముతో
నింపుము నా యేసయ్యా. ||జీవప్రధాతవు||
