జీవపు మార్గ జ్యోతివి - సిలువ మోసిన యేసు
మహిమ పూర్ణుడగు నీవే - సిలువ మోసిన యేసు
1. శరీరధారివైతివి - నీ ప్రేమను కనుపరచితివి
దీనుల నుద్ధరించితివి - సిలువ మోసిన యేసు
2. నీవే మార్గ సత్యమని - నీకు పేరు కలిగెను
నిత్యజీవపు దాతవు - పునరుత్థానుడవు నీవే
3. అర్పణ చేసితివి బలిగా - సిలువపై నీ ప్రాణమును
కడిగితివి నీ రక్తముతో - సిలువ మోసిన యేసు
4. నీ ద్వారమున జేరితిమి - నీచులము అయోగ్యులము
నీకే మహిమ స్తుతి ఘనత - సిలువ మోసిన యేసు
5. కల్వరి మార్గ యాత్రికులం - నీకే జయమని పాడెదము
సర్వద నిను స్తుతియించెదము - సిలువ మోసిన యేసు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన Lyrics
Your favourites
- No Favourites found!
