Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జీవింతు నేను Telugu Christian Song Lyrics

జీవింతు నేను Lyrics

జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు
యేసు కొరకే జీవింతును (2)
నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే
నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే
జీవింతును జీవింతును
జీవింతును జీవింతును (2)       ||జీవింతు||

నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే
బహుమానము పొందగ పరుగిడుదున్
వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి
కొరకే నే వేగిరపడుదును (2)
నన్ను ప్రేమించిన యేసుని చూతును
నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును
గురి వైపుకే – పరుగెడుదును
వెనుదిరుగను – వెనుదిరుగను (2)       ||జీవింతు||

శ్రమయైనా బాధైననూ – హింసయైనా
కరువైనా ఎదురైననూ
ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా
ఎతైనా లోతైననూ (2)
నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి
నేను విడిపోదునా ప్రభు నీడనుండి
జీవింతును – నా యేసుతో
జయమిచ్చును – నా యేసుడే (2)       ||జీవింతు||

Your favourites

  • No Favourites found!